Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా పెద్దిభోట్ల ఏకగ్రీవం.

నూతన కార్యదర్శి పెద్దిభోట్లను సత్కరిస్తున్న దృశ్యం

పాలకొల్లు: అక్టోబర్, 8
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో గురువారం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం అధ్యక్షతన ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ (సీపీడీసీ) సమావేశం జరిగింది. గత నెల 24
వరకు సి.పి.డి.సి. కార్యదర్శిగా డాక్టర్ బి.వి. రాఘవయ్య కొనసాగారు. వారి మృతి నేపథ్యంలో కార్యదర్శి పదవి ఖాళీ అయ్యింది. ఈ పదవి భర్తీ చేయడానికి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కమిటీలోని ప్రస్తుత సభ్యులలో ఒకరైన స్థానిక ప్రముఖ ఆడిటర్, రసధుని సాహితీ సంస్థ వ్యవస్థాపకులు, బ్రాహ్మణ సంఘం ప్రముఖులు పెద్దిభోట్ల . లక్ష్మీనారాయణను సి.పి.డి.సి. కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధిలో ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యదర్శి పి. లక్ష్మీనారాయణ కమిటీ సభ్యుల సహకారంతో కళాశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడానికి కృషి చేయాలన్నారు.అలాగే, గతంలో కార్యదర్శిగా గమనీయమైన సేవలందించిన, డాక్టర్ బి.వి. రాఘవయ్య సేవలను స్మరించుకున్నారు.
సి.పి.డి.సి. సభ్యులు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వి. రంగారావు, ఛాంబర్స్ కళాశాల చైర్మన్, కారుమూరి రామలింగేశ్వరరావు, అద్దేపల్లి వారి వారసులు మోహన్ దాస్, విజయోలాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ, నిమ్మకాయల రామకృష్ణ, పెదపూడి వరలక్ష్మి తదితరులు నూతన కార్యదర్శి ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యదర్శి నాయకత్వంలో కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. నూతన కార్యదర్శి పి. లక్ష్మీనారాయణకు
అభినందనలు తెలిపారు. నూతన కార్యదర్శి పి. లక్ష్మీ నారాయణ,ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర స్థాయి స్వచ్ఛత అవార్డు అందుకొన్న కొమ్ముల మురళీ కృష్ణ ద్వయాన్ని సత్కరించారు.

ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ , అకాడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, అధ్యాపకులు పి శ్రీనివాసరావు, డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, డి మన్మధరావు, సూపరిండెంట్ బి కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.