Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా.

గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈనెల 26న ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గం విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 20 పైగా కంపెనీలు 1500 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఛాంబర్స్ కళాశాల వేదికగా జరగడం పట్ల కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ12,000 నుండి 32,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. కళాశాల వద్ద శనివారం ఉదయం 10 గంటలకు హాజరవ్వాలని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్నవారు నైపుణ్యం పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చునన్నారు.
ఇతర వివరములకు కళాశాల ప్లేస్మెంట్ అధికారులు జానకి రామయ్య మరియు టి మీనాలను 9912046234, 9493503441 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు , సెక్రెటరీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భవన్ , గవర్నింగ్ బాడీ మెంబర్స్ నాగేంద్ర కుమార్ ,సతీష్ , జయప్రకాష్ నారాయణ, విశ్వనాథ రాజు గారు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.