Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమం.

నిమజ్జనం ఊరేగింపు
అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజి బాబు

తాపేశ్వరం, సురుచి స్వీట్స్ 51కేజీల లడ్డు వితరణ

భీమవరం:సెప్టెంబర్, 23
(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమం భీమవరం శాసన సభ్యులు పి ఏ సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. స్వామి వారికి తాపేశ్వరం కి చెందిన సురుచి స్వీట్స్ వారు సమర్పించిన 51 కేజీల లడ్డూ ను భక్తులకు వితరణ చేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ స్వామి వారి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి జానకి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు.