Telugu News Power

జగనన్న బహిరంగ సభ విజయవంతం చేయాలి. శ్రేణులకు ముదునూరి పిలుపు.

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి
వైసిపి సమావేశానికి హాజరైన నాయకులు

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ముదునూరి ప్రసాద రాజు పిలుపునిచ్చారు. శ్రేణులను సన్నద్ధపరిచే కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ రాజు ప్రసంగించారు. జిల్లాలో ఉన్న ఆక్వా రైతుల కష్టాలు చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆక్వా రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుందని తెలిపారు. సభను విజయవంతం చేయటానికి పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కోరారు. ఈనెల 15న భీమవరంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు ఆక్వారైతులను పెద్ద సంఖ్యలో సమీకరించి తీసుకురావాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్ఆర్సిపి పార్టీ ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీడ్ ఫ్యాక్టరీలు, ఎగుమతి కంపెనీలపై ఏ విధమైన చర్యలు తీసుకోలేక పోతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జి గుడాల హరి శ్రీ గోపాలరావు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, పరిశీలకులు మురళీకృష్ణంరాజు జడ్పిటిసి నడపన గోవిందరాజులు నాయుడు, బందెల నరేష్ పెచ్చెట్టు కోటేశ్వరరావు, పెనుమత్స యేసు రాజు, గుంటూరు పెద్దిరాజు, దేవరపల్లి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.