భీమవరం: జూలై,12(తెలుగు న్యూస్ పవర్.కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం కి చెందిన జక్కంశెట్టి హరీష్, కొంకిపూడి కిరణ్ లక్ష రూపాయలు విరాళం గా అందజే సారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.
అమ్మవారి చిత్రపటం అందుకుంటున్న దాతలు