Skip to main content

Telugu News Power

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. స్వాగతించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

వైసిపి ఉండి ఇంచార్జ్, పి. నరసింహ రాజు జనసేనలో చేరిక

ఖాళీ అవుతున్న వైసీపీ.

మంగళగిరి:సెప్టెంబర్,25
(తెలుగు న్యూస్ పవర్. కం)
జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు, నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడు, మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ నరసరావుపేట నుంచి ఏలూరి ప్రసాద్ లకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీ ఉన్నతి కోసం పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.