విజయవాడ: మే ,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల దేశంలో జరిగిన మినీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా, బిజెపి పార్టీ నాయకులు, శ్రేణులు దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి.
బిజెపి రాష్ట్ర కార్యాలయం,విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరసాపురం లోక్ సభ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని, ఈ సమావేశంలో పదాధికారులందరం కలిసి మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు శక్తి కేంద్రాలు, మండలం మరియు జిల్లా కమిటీల సమావేశాలను కూడా ప్రతి నెలా విధిగా నిర్వహించాలని నిర్ణయించారు.
రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులను మరింత సమన్వయం చేసుకుంటూ, పార్టీ లక్ష్యాల సాధన దిశగా ఐకమత్యంతో వేగంగా ముందుకు సాగాలి అని ఈ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు. రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ,బిజెపి రాష్ట్ర నాయకులు, పదాఅధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలు