యలమంచిలి:మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గమళ్ళ పెంట కు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్ వారు నెలవారి సేవా కార్యక్రమంలో భాగంగా, ఇటీవల భర్తను కోల్పోయిన మహిళకు రూ. 14 వేల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. గుంపర్రుకు చెందిన జడ్డు మణికంఠ విద్యుత్ ఘాతం తో మరణించారు. జై భీమ్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డం సునీల్ గావాస్కర్ తమ ఫౌండేషన్ ద్వారా ప్రతినెలా రెండు కుటుంబాల వారికి సహాయం అందింస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఉత్తమ ఉపాధ్యాయులు రాయపూడి భవాని ప్రసాద్, లైఫ్ సేవర్స్ అధ్యక్షులు కోట దుర్గాప్రసాద్,ప్రిన్సిపల్ స్వర్ణలత, మత్తే వజ్రమ్మ, సత్య లక్ష్మి,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్ ఫౌండేషన్ సహాయం.
జై భీమ్ ఫౌండేషన్ ద్వారా సహాయము అందిస్తున్న దృశ్యం