Telugu News Power

డాక్టర్ చినమిల్లికి ప్రముఖుల నివాళి.

డాక్టర్ చనిపోయిన సత్యనారాయణ రావు (దాచిన చిత్రం)

నర్సాపురం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేదల ప్రముఖ వైద్యులు, ప్రతిష్టాత్మక వై ఎన్ కాలేజీ మాజీ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు (85) ఆదివారం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నర్సాపురం పట్టణ విద్యాభివృద్ధిలో చినమిల్లి సృష్టించిన చరిత్ర మర్చిపోలేనిది. సుదీర్ఘకాలం ఆ విద్యా సంస్థ బహుముఖ ప్రగతికి చిన్నమిల్లి అహర్నిశలు శ్రమించారు. పేద రోగులకు ఉచిత వైద్యం కూడా అందించారు. ఈయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు,స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బొమ్మిడి నాయకర్, టిడిపి పోలీసు వీరు సభ్యులు ఎంఏ షరీఫ్, టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి జానకిరామ్, బండారు మాధవ నాయుడు, ముదునూరి ప్రసాద్ రాజు, బోయిన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అందే రామ సతీష్, పోలిశెట్టి శ్రీ రఘురామారావు, స్వర్ణ ఆంధ్ర చైర్మన్, కొండవీటి సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, నెక్కంటి సుబ్బారావు, కొప్పాడ రవి, రెడ్డప్ప దవేజి,కొల్లు పెద్దిరాజు, పోలిశెట్టి పుష్పవల్లి తదితర పోలూరు అభిమానులు రాయపేట లోని వారి స్వగృహం వద్ద నివాళులర్పించారు. పురవీధులకుండా సాగిన అంతిమయాత్రలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.