Telugu News Power

జోన్లు ఏర్పాటులో ఉద్యోగుల తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. -ఉద్యోగ సంఘ నేత శ్రీకాంతరాజు డిమాండ్.

సమావేశానికి హాజరైన మహిళా ఉద్యోగులు

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తగా ఏర్పాటు చేసే జోనల్ విధానాల్లో ఉద్యోగుల ను భాగస్వాములను చేయటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీకాంతరాజు డిమాండ్ చేశారు. స్థానిక పింఛనుదారుల సంఘ భవనంలో ఆదివారం జరిగిన మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, డి.ఏ.బకాయల విడుదల, పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యాలయ సమయంలో కాకుండా, ఉదయం, సాయంత్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ (వి.సి) లు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై ఆకుల భారాన్ని తగ్గించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులు కూడా 62 ఏళ్ల వయోపరిమితి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డి సి పి ఓ, ఐ సి పి ఎస్, డిఇఓ, బిపిసి లకు బదిలీ విధానం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారిని విడుదల చేయాలని కోరారు. సంఘ నాయకులు ముఖ్య నాయకులు, మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, జెట్టి సత్యనారాయణ, రేవతి ఝాన్సీ,వినయ్ శ్రీరామ్, సతీష్, బాజీ, వినయ్ తదితర పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.