అమరావతి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటిపి) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి, ఆమోదించింది.
ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4 వేలు గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు భారీ ఊరట లభించింది. ఈ రాయితీ వల్ల ఇతర రాష్ట్రాలకు మారిన వాహనాల రిజిస్ట్రేషన్లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉంది.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధి, టూరిజం ప్రోత్సాహం, వాహన యజమానుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు మంత్రి మంత్రి మండిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని అమరావతి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి,కేక్ కట్ చేయించారు. ప్రెసిడెంట్ గౌతమ్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ కెవిఆర్ నాని, కార్యదర్శి రాంబాబు, కోశాధికారి సందీప్, జాయింట్ కోశాధికారి సువర్చలాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టూరిస్ట్ బస్సు ఆపరేటర్లకు భారీ ఊరట, కూటమి ప్రభుత్వ వరం. -బస్సు ఆపరేటర్ల కృతజ్ఞతలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ.
టూర్ ఆపరేటర్లతో కలసి కేక్ కట్ చేస్తున్న మంత్రి మండిపల్లి