Skip to main content

Telugu News Power

నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుని వైద్యానికి రూ. లక్షన్నర సాయం.

నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుని వైద్యానికి సహాయం చేస్తున్న దాతలు


పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)నిరుపేద పురోహితులు నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు సాయిశ్రీరామ్ వైద్యం నిమిత్తం దాతలు పెద్దమనసుతో ముందుకు వచ్చి సుమారు లక్షా యాభైవేల రూపాయల ఆర్ధిక సహకారం అందించారని, తెలుగుదేశం నాయకురాలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పెండ్యాల భవాని బుధవారం తెలిపారు. శ్రీ గాయత్రీ స్మార్త పురోహిత సంఘ అధ్యక్షులు, నుదురుమాటి శ్రీనివాస్ శర్మ , ప్రధాన కార్యదర్శి ఈరంకి కాశీవిశ్వనాధం, శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ రేపాక ప్రవీణ్, శ్రీ క్షీరా రామలింగేశ్వరా దేవస్థానం చైర్మన్ మీసాల రాము, పాలకమండలి సభ్యులకు నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబ సభ్యులు దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు.