
భీమవరం: జూన్,24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం ఆవరణలో లోకకళ్యాణార్థం సుదర్శన హోమం నిర్వహించారు. దుష్టశక్తుల నివారణకు,ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాల కోసం, కుటుంబ సౌఖ్యం, గ్రహదోష నివారణ కోసం, వ్యాపార వృద్ధి, నిర్మాణ రంగం అభివృద్ధి కొరకు బుధవారం దశమి, చిత్త నక్షత్రం కలిసి, దశ పాప హరం ప్రాముఖ్యత గల రోజున సుదర్శన హోమ మహోత్సవం అత్యంత వైభవముగా జరిగింది..ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు నిర్వహించారు. ఈ హోమ. నిర్వహణకు..శివదేవుని చిక్కాల కు చెందిన.ప్రముఖ సిద్ధాంతి జ్యోతిష్య వేత్త ర్యాలి కృష్ణప్రసాద్ సహకారం అందించారు. వారికి దేవస్థానం ఈఓ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు.. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి శేషవస్త్రం అందచేసారు. ఈ సందర్బంగా, ఎమ్మెల్యే మాటాడుతూ,ఈ హోమం ఫలం వల్ల ప్రజలు అందరూ బాగుండాలి అని కోరారు. మాజీ ఎంపీ తోట సీతారామ
లక్ష్మి, కోళ్ల నాగేశ్వరావు, చనమల చంద్రశేఖర్ తదితరులు సుదర్శన హోమంలో పాల్గొని, అనంతరం అమ్మవారు దర్శనం చేసుకొన్నారు. దేవస్థానం ప్రాంగణంలో మంత్రోచ్ఛారణ మారుమ్రోగి భక్తులు మంత్రముగ్ధులయ్యారు.శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు …హోమం లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం తో పాటుగా, సుమారు 1200 భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్,. చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,వుదిసి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి,మిర్తిపాటి గుణేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల,గొంతిన రమణ,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గూట్లపాడు, సీసలి, భీమవరం, తదితర వివిధ ప్రాంతాలనుండి వచ్చిన మహిళా సేవకులు.. భక్తులకు, సేవలు అందించారు.
