Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు కంటిపూడి కుటుంబ సభ్యులు రూ. 3 లక్షల విరాళం.

శ్రీ మావుళ్ళమ్మ విరాళం ఇచ్చిన కంటిపూడి కుటుంబ సభ్యులు

భీమవరం:ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి కాకినాడకు కు చెందిన కంటిపూడి విద్యాసాగర్ సావిత్రి దేవి దంపతులు రూ. 2 లక్షల విరాళం సమర్పించారు. శ్రీ అమ్మవారి శాశ్వత అన్నదాన వితరణకు చి. వివేక్ పేరుమీద రూ.1 లక్ష విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారని, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.