Telugu News Power

నేడే గజమాల యాత్ర మహోత్సవం ప్రారంభం.

పూజ్య శ్రీ మొల్లేటి దంపతుల

మొగల్తూరు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముత్యాలపల్లి లో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ బండిముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం 9:00 గంటల నుంచి గజమాల యాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాల తిరుపతిగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లోని అప్పనపల్లి దేవస్థానం చైర్మన్ మొల్లేటి చక్రపాణి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాత శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి పుణ్య దంపతులు అప్పనపల్లికి పేరు రావడానికి కారణం. సాక్షాత్తు కలియుగం వెంకటేశ్వర స్వామి నిలువెత్తు నిదర్శనం. ఒక సామాన్య వ్యక్తి కొబ్బరి వ్యాపారం చేస్తుండగా ఆ కొబ్బరి రాసులో అసలు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు స్వామివారు ఆ రాత్రి ఆయన కలలో ప్రత్యక్షమై ఒక కోరిక కోరాడు. నాకు గుడి నిర్మించాలని వెంటనే శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి ఆలయాన్ని నిర్మించినారు. ఇండియాలోనే మొట్టమొదటి అన్న ప్రసాదం మొదలుపెట్టిన దేవస్థానం అప్పనపల్లి శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి. ఆ నాడు సీఎం స్వర్గీయ విశ్వ విఖ్యాత నట సార్వబౌమ నందమూరి తారక రామారావు అప్పనపల్లి లో పర్యటించినప్పుడు అక్కడి అన్న ప్రసాదాన్ని చూసే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుపతి దేవస్థానం లో అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. అది ఈనాటికి గొప్పగా జరుగుతుంది.
కలియుగం వెంకటేశ్వర స్వామి బాల తిరుపతి గా పేరు పొందిన అప్పనపల్లి లోని మొల్లేటి రామస్వామి పుణ్య దంపతులకు రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘం వారు గజమాల యాత్ర ప్రారంభించి. ఈ గజమాల యాత్రను ప్రతీ సంవత్సరం అంగరంగ వైభవంగా తీసుకొని వెళ్తున్నారు. అలాంటి యాత్రను ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి లో వెలసిన శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరనుండి ప్రారంభించాలి అని నరసాపురం నియోజకవర్గం శెట్టిబలిజ సంక్షేమ సంఘం వారు రాజోలు తాలూకా సంఘం వారిని అడగగా వారు సానుకూలంగా స్పందించినారు. అందుకే గజమాల యాత్రను శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి ప్రారంభిస్తున్నారు. కావున ఈ గజమాలయాత్రకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు శెట్టిబలిజ సోదరులు సోదరిమణులు యువత రామస్వామి గారి అభిమానులు కుల మతాలకు, పార్టీలకు అతీతంగా విచ్చేసి పాల్గొని ఈ గజమాల యాత్రను విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్చారు. రాజులు నరసాపురం శెట్టిబలిజ సంఘాల ఆధ్వర్యంలో ఈ భారీ గజమాల యాత్ర నిర్వహిస్తున్నారు.