
పాలకొల్లు: అక్టోబర్, 11
(తెలుగు న్యూస్ పవర్.కామ్) పట్టణం ఇంకా నిద్ర నుంచి మేల్కోలేదు, వీధి దీపాలు వెలుగే,దారి చూపుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శనివారం ఉదయం తెలతెలవారుతుండగా వెలుగు రేఖలా, తన క్యాంపు కార్యాలయం నుండి సైకిల్ సవారీ ప్రారంభించారు. పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం చేరుకున్న మంత్రి స్వచ్ఛభారత్ కార్మికులతో ముచ్చటించారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యంతో స్వచ్ఛ కార్మికుల పాత్ర విశిష్టమైనదన్నారు. ఇందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి పర్యటన టిడ్కో గృహ సముదాయం వద్దకు చేరింది. ఇక్కడ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించి, తగు సూచనలు చేశారు. స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి, పట్టణ పరిశుభ్రతే శ్రీరామరక్షగా భావించి పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టికి వ్యతిరేకరించినట్టు మంత్రి నిమ్మల వెల్లడించారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు తమ వంతు సహకారం నించాలని విజ్ఞప్తి చేశారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇవ్వడం వల్ల చెత్త సమస్య తగ్గి, కార్మికుల శ్రమ, సమయం కలిసి వస్తుందన్నారు. పురప్రజలు చెత్తను కేటాయించిన ప్రదేశంలో మాత్రమే వేసిన క్రమశిక్షణ పాటించాలని కోరారు. సాధారణంగా అధికారులు చేసే రోజు వారి పర్యటన, ఏ ఆర్పాటం లేకుండా, కార్య సాధకుడుగా మంత్రి నిమ్మల చేసిన పర్యటన ప్రజల్లో చర్చకు దారి తీసేలా, మన్ననలు పొందింది.
