పాలకొల్లు: అక్టోబర్, 22
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సౌజన్యంతో, ఐస్టా, ఏపీ ఎస్ టి పి ఏ ఆధ్వర్యంలో జరిగిన చెరుకూరి బుద్ధావతారం రాజు, స్మారక అఖిలభారత, సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ మేరకు,ఈ ఏడాది టోర్నమెంట్ ముగిసినట్టు, కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టుముక్కల బూన్ రాజు ప్రకటించారు. స్థానిక కాస్మో కాంప్లెక్స్ వేదిక పై బహుమతి ప్రధానోత్సవం జరిగింది. కాస్మో కాంప్లెక్స్ అధ్యక్షులు, టోర్నమెంట్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, డైరెక్టర్ వివి సోమరాజు, జాయింట్ సెక్రెటరీ, ఏ. రాంబాబు విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎంపైర్లు వినుకొండ దినేష్, పి.వరప్రసాద రాజు, రిఫరీ గజేంద్ర నాయుడు, సినీ నటుడు సారిక రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే:
ఎంవి శివకుమార్ రాజు, రామకృష్ణయ్య ( ఆంధ్ర ) కే వి ఎస్ మూర్తి( తెలంగాణ), మణికన్న న్( తమిళనాడు ), వి శ్రీనివాసుల రెడ్డి (ఆంధ్ర), ఎస్ ఎస్ రత్తు(ఒడిషా), ఎన్. సి. అశోక్ రెడ్డి( ఆంధ్ర), కే రాధాకృష్ణమూర్తి ( ఆంధ్ర), కే రాజేంద్రప్రసాద్ ( ఆంధ్ర), గంజి వెంకట రెడ్డి, కబీర్, భాస్కరరావు( తెలంగాణ), మీ పార్థసారధి (తళనాడు) తదితరులు వివిధ విభాగాల్లో, సింగిల్స్, డబుల్స్ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, కాస్కో కాంప్లెక్స్ తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు, ఆతిథ్యానికి, ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు. తమ క్రీడా జీవితంలో ఈ పోటీలు మరుపురాని ఘట్టంగా నిలుస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ వ్యవస్థాపకులు చెరుకూరి బుద్ధ అవతారం రాజు కు ఎప్పటికీ టెన్నిస్ క్రీడా లోకం రుణపడి ఉంటుందన్నారు. ఈ టోర్నమెంట్ ఇంకా కొన్ని రోజులు జరిగితే బాగుంటుందన్నట్టుగా ఉందని, ఈ సంబరాలు ముగించి వెళ్లడం కొంత బాధగా ఉందని, చెబుతూ, తమ జ్ఞాపకాలను వచ్చే ఏడాది వరకు తలుచుకుంటామన్నారు.