పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెన్షన్ రోజే, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మూడు పండగలు కలిసిన పెద్ద పండుగని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధాప్య పెన్షన్ రూ. 2 ల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదేళ్ల కాలయాపన చేశారని విమర్శించారు. దివ్యాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం, అంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6వేల రూపాయలు, మంచం పట్టిన వారికి 10-15 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు. పింఛన్లు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం అంటే అది పేదవారి పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం అని వెల్లడించారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వానికి మద్దతు తెలిపారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, పక్షవాతానికి గురైన పింఛన్దారుకు మంత్రి స్వయంగా సొమ్ము అందజేశారు. వారి కుటుంబానికి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో, పెచ్ఛెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

పెన్షన్ ఇచ్చి, స్వీట్ తినిపిస్తున్న మంత్రి నిమ్మల