Telugu News Power

చవాకుల ట్రస్ట్ కు దాసరి సేవా రత్న అవార్డు.

దర్శకులు బోయపాటి శ్రీను నుంచి అవార్డు అందుకుంటున్న సూర్య నరేష్ .

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చవాకుల చారిటబుల్ ట్రస్ట్, దాసరి లెజెండరీ అవార్డు అందుకుంది. దాసరి లెజెండరీ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ సినీ ల్యాబ్స్ లో అత్యంత వై భవం శుక్రవారం జరిగింది. చవాకుల ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు చవాకుల సూర్య నరేష్ సేవలు గుర్తించి, దాసరి సేవారత్న అవార్డును ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నట దర్శక నిర్మాత మురళీమోహన్, సీనియర్ నటులు సుమన్, దర్శకుడు రేలంగి నరసింహారావు, వి ఎన్ ఆదిత్య, నిర్మాత తుమ్మలపల్లి రామా సత్యనారాయణ తదితర పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.