Skip to main content

Telugu News Power

ప్రధాని మోడీ మాట, బంగారు భవితకు బాట. -రాష్ట్ర బిజెపి మీడియా కన్వీనర్ కపర్ది.

పాలకొల్లు: మే 22, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుమేరకు, అందరూ పొదుపు చర్యలు పాటించాలని, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్, ఏఎంసీ మాజీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రధాని మోడీ సూచించిన అంశాలు అనివార్యంగా ఆచరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న భయానక యుద్ధ పరిస్థితులు సృష్టించే సమస్యలకు ముందుగానే సిద్ధం కావటానికి ప్రధాని మోడీ పిలుపు శ్రీరామరక్ష అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటం, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటం, వాణిజ్య లోటు విరిగిపోవడం వల్ల విదేశీ మారకద్రవ్యం నిలువలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజలు ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని కోరారు. బంగారం కొనటం, వంట నూనెను ఎరువుల వినియోగం తగ్గించడం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందన్నారు. రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో దానినియంగా పడిపోయి, ఒత్తిడికి గురవుతుందని గుర్తు చేశారు. ప్రజలు అన్ని రకాలుగా పొదుపు చర్యలు పాటించి, ప్రధాని ఆశయం, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు