పాలకొల్లు: మే,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు అసహనంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హితవు పలికారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ, దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. గతంలో నిమ్మల రామానాయుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు ఎంపీపీ, జడ్పిటిసి పదవుల కోసం ప్రయత్నించి భంగపడ్డారని గుర్తు చేశారు. నాటి ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి ద్వారా తెలుగుదేశంలో ప్రవేశించి, ఆయననే బయటికి గెంటేసిన చరిత్ర మీది కాదా అని శేషుబాబు ప్రశ్నించారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసిన అంగర రామ్మోహన్ రావు సొంత గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టుకోకుండా, మొక్కలు నాటుకోకుండా అడ్డుకోవడం ఆయన తొక్కేయటం కాదా అని విమర్శించారు. ముందు నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారిని వెళ్లగొట్టిన ఘనత నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కి పోటీ చేస్తే రెండు లక్షల ఓట్లలో మీకు వచ్చింది 1500 ఓట్లు మాత్రమేనని మర్చిపోవద్ధన్నారు. మంత్రి రాజకీయాల్లోకి రాకముందు వడ్డీ వ్యాపారం చేసి, పాపాలను కడిగేసుకోవడానికి ఫౌండేషన్ పెట్టేరు తప్ప ప్రజల కోసం కాదని ఆరోపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. స్థానిక యువత ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలకొల్లుకు ఇచ్చిన వైద్య కళాశాలను అట్టుకోవడం వల్ల మాది మందికి వచ్చే ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. సమావేశంలో అధ్యక్షులు యడ్ల తాతాజీ, ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు విరమించుకోండి. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు హితవు.
సమావేశంలో మాట్లాడుతున్న మేక శేషుబాబు