Telugu News Power

భూ సేకరణలో రూ. 1,140 కోట్ల భారీ స్కాం. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్.

అమరావతి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశించాలని విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు సమర్పించింది. గత ప్రభుత్వాలలో జగనన్న కాలనీలు నిర్మించడానికి భూసేకరణ జరిగింది. భూ సేకరణ ధర అర్జెంటు రేటు కంటే ఎక్కువ చెల్లించడం, ఊరికి దూరంగా, కొన్నిచోట్ల అసలు అవసరం లేకుండా భూసేకరణ జరిగినట్టు గుర్తించారు. అసలు నివాసయోగ్యం కానీ స్థలాలు ఎంపిక చేయటం పట్ల కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వైసీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీ స్కాం కు పాల్పడ్డట్టు తెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం విలువ రూ. 1,140 కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం వివరాలు విజిలెన్స్ విచారణ లో బయటపడ్డాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రూ. 654 కోట్ల మేర అవినీతి జరిగింది విజిలెన్స్ శాఖ స్పష్టం చేసింది. దీనిపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.