Skip to main content

Telugu News Power

బాధితులకు అండగా ఉంటాం -ఎమ్మెల్యే అంజిబాబు.

ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన 12 మంది శ్రామికులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) భరోసా ఇచ్చారు.. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజిబాబు గురువారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డా గంటా త్రిముర్తులు, పొత్తూరి బాపిరాజు, యలమంచిలి శ్రీనివాస్, కాపా అమర్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.