Telugu News Power

అంగన్వాడి పోస్టుల భర్తీకి పిలుపు.

సిడిపిఎస్ అధికారి ఎం ఉమ

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ పరిధిలోగల అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని , ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి, సిడిపిఓ ఎం. ఉమ గురువారం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, జూలై నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులు. స్థానిక స్థిర నివాసం గల వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాలు స్థానిక ఐ టి డి ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి పొందవచ్చునని సూచించారు.