తిరువనంతపురం: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)’గాడ్స్ ఓన్ కంట్రీ(దేవతల రాజ్యం),రుతుపవనాలు ఆగమన ముఖద్వారం, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, అత్యధిక విద్యావంతులు రాష్ట్రం, మధ్యపప్రాచ్యం నుంచి అత్యంత ఎక్కువ విదేశీ మారక దృవ్యం ఆశిస్తున్న రాష్ట్రం, ప్రపంచవ్యాప్తంగా నర్సుల సేవలకు మారుపేరు కేరళం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా అధికార పీఠం నుంచి అవరోహణ చేసింది. అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీని ముగ్గురు అభ్యర్థులు ముఖ్యమంత్రి పీఠం కోసం ముప్పు తిప్పలు పెట్టారు. ఎట్టకేలకు
వి డి సతీషన్ శాసన సభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటు, నిజాయితీగల నేత, మాజీ రక్షణ మంత్రి, ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే అంటోనీ తో తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడిన తర్వాత దాదాపు పది రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం సతీశన్ను కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టమైంది.
పార్టీ అంతర్గత చర్చలు, నాయకత్వ ఎంపికపై సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. సతీశన్ ఎంపికతో కేరళ కాంగ్రెస్లో కొత్త రాజకీయ శకం ప్రారంభమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేరళ సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్ — ఏ.కే. ఆంటోనీతో భేటీ
కాబోయే ముఖ్యమంత్రి సతీషన్