అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి
డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు, డీసీహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగ మానస, ఐసీడీఎస్ పీడీ, అదనపు డీఎంహెచ్‌వో భారతి లక్ష్మి విచారణ చేశారు.ఈ సందర్భంగా, ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను ప్రత్యేక బృందం ప్రశ్నించి, కేసుకు సంబంధించిన పలు వివరాలను రాబట్టారు.. ఆసుపత్రి రికార్డులు, వైద్య విధానాలు, చట్టపరమైన నిబంధనల అమలుపై అధికారులు ఆరా తీశారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా ఆసుపత్రి మూసివేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలిక గర్భం దాల్చడం, గర్భస్రావం చేసిన ఆసుపత్రి గురించి, స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.
ఆసుపత్రిలో విచారణ నిర్వహిస్తున్న అధికారులు