
విజయవాడ: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ప్రతీ చిత్రంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ‘పెద్ది’ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకొని, తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో విరివిగా షూటింగ్‌లు నిర్వహించేందుకు, రికార్డింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మౌలిక వసతుల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను మరింత వేగంగా అందించి, చిత్ర పరిశ్రమకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను సినీ నిర్మాణాలకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా ‘పెద్ది’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, హీరో రామ్ చరణ్ , హీరోయిన్ జాహ్నవి కపూర్, నిర్మాత వెంకట సతీష్ కిలారు, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. సినిమా అభిమానులను, రామ్ చరణ్ ఫ్యాన్స్ ను ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతగానో ఆ కొట్టుకుని, తీయటి జ్ఞాపకంగా మిగిలింది.