భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారత రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ ప్రయోజనకర రెడ్ క్రాస్ నూతన భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం రాయలం గ్రామంలోని బ్లడ్ బ్యాంక్ కమ్యూనిటీ హాల్లో తాత్కాలికంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ, కొత్త భవనం ద్వారా మరింత విస్తృత సేవలను ప్రజలకు అందుతాయి.
ఈ నూతన భవనంలో సింగిల్ డోనర్ ప్లేట్లెట్ యంత్రం, డయాగ్నస్టిక్ సేవలు, జనరిక్ మెడికల్ షాపు, విపత్తుల సమయంలో అవసరమైన సహాయక సామగ్రి నిల్వ చేయటానికి, పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య, సేవా కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు.