Skip to main content

Telugu News Power

మాస శివరాత్రి రోజు రుద్ర హోమం.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో శనివారం మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం నిర్వహించారు. పలువురు దంపతులు భక్తిశ్రద్ధలతో హోమం, పూజలు జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న భక్తులచే పూజలు జరిపించారు. సాయంత్రం లీలా కళ్యాణ మండపంలో లీలా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పలువురు భక్తులు, పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.