Telugu News Power

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరును పూజలు.

క్షీరా రామంలో పూజలు నిర్వహిస్తున్న తెలుగుదేశం నాయకులు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు76వ జన్మదినోత్సవము సందర్భంగ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారు పార్వతి అమ్మవార్ల పెద్ద పూజలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మరియు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో బృహత్తర మైన కార్యక్రమంలు చేపట్టాలని శ్రీ స్వామి వారికి పూజలు జరిపించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని వారు తొందరగా కోలుకుని రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేసే భాగ్యం కలగాలని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారు
పార్వతి అమ్మవారి దగ్గర అభిషేకములు చేయించినారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ధర్మకర్త బాసిన సత్యనారాయణ గారు అల్లంపల్లి పకీర్ బాబు గారు, నడుంపల్లి ఆంజనేయులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.