Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో జనసేన నాయకుల పూజలు.

పెదగోపురం లో పూజలు నిర్వహించిన జనసేన నాయకులు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని పాలకొల్లు జనసేన పార్టీ తరఫున శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుతూ పంచారామ క్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద గోత్రనామాలుతో అర్చన జరిగింది . ఈ కార్యక్రమంలో పాలకొల్లు టౌన్ జనసేన పార్టీ నాయకులు పెదకూర అన్నయ్య ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్ట్ బెట్ట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.