Skip to main content

Telugu News Power

యలమంచిలి మండలం లో సరస్వతి పూజ.

శ్రీ పుంతల ముసలమ్మ సరస్వతి పూజ దృశ్యం
శ్రీ మూలస్థానేశ్వరి ఆలయంలో సరస్వతి పూజలో బాలలు.

యలమంచిలి: అక్టోబర్,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల కేంద్రమైన యలమంచిలిలో వేంచేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం సాయంత్రం సరస్వతి పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పలువురు బాలలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆలయ నిర్వహకులు, తాళ్లూరి శ్రీనివాస్, ( వైజాగ్ బుజ్జి) సౌజన్యంతో బాలలకు విద్యాసామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు. తీర్థ ప్రసాదాలు అందచేశారు. కార్యక్రమంలో, తాళ్లూరి సత్య శ్రీనివాస్,బొప్పన శివ, ఆకుల యేసు, సాయి, వెంకట్,
తదితరులు పాల్గొన్నారు.
స్థానిక కాపులపాలెం, శ్రీ పుంతల ముసలమ్మ ఆలయం లో శరన్నవరాత్రుల 26వ వార్షికోత్సవం సందర్భంగా, స్థానిక దేవి యూత్ ఆధ్వర్యంలో సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా,బాలలకు విద్యా సామాగ్రి అందజేశారు. దొడ్డిపట్లలో పురాతనమైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో, దసరా సందర్భంగా అమ్మవారు శుక్రవారం సరస్వతి దేవి అవతారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

దొడ్డిపట్ల పురాతన కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహ దర్శనం