Skip to main content

Telugu News Power

పాలకొల్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లో, పాత నేరస్తులపై బైండోవర్ కేసులు.

తాసిల్దార్ కార్యాలయం వద్ద హాజరు పరిచిన పాత నేరస్తులు

పాలకొల్లు: అక్టోబర్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక ఎన్నికల నేపథ్యంలో,పాత ఎక్సైజ్ కేసుల్లోని ముద్దాయిలకు కౌన్సెలింగ్,
రూ.1 లక్షకు బైండోవర్ కేసుల నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ మద్ది రామశేషయ్య, శుక్రవారం వెల్లడించారు. గతంలో నకిలీ మద్యం,గంజాయి, సుంకం చెల్లించని మద్యం, తదితర కేసుల్లో ఉన్న పాత ముద్దాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా
ఏడుగురు పాత నేరుస్తులకు భవిష్యత్తులో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని సూచించారు. అనంతరం వారిని పాలకొల్లు, తహసిల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారి ఎదుట హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున బైండోవర్ చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ మద్ది రామశేషయ్య తెలిపారు.అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సి ఐ హెచ్చరించారు.