Telugu News Power

రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రపంచంలో కొనలేనిది రక్తం. కలెక్టర్ కుమారుడి రక్తదానం.

రక్తదాన శిబిరంలో మాట్లాడుతున్న కలెక్టర్ నాగరాణి
రక్తదాతకు దృవపత్రం అందజేస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్. ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం. అత్యవసర సమయాల్లో ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదని తెలిపారు. తలసేమియా బాధితులు సహా అనేక మంది రోగులకు రక్తదానం జీవనాధారం అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ నిజమైన ప్రాణదాతలతో సమానం అన్నారు.రక్తదానంపై చైతన్యం కల్పిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్.ఆర్. ఫ్రెండ్స్ సేవా సమితి సేవలను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తనయుడు చదలవాడ భరత్ చంద్ర స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. రక్తదాన శిబిరం వద్ద
“రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి”
“ఒక దానం – ఎన్నో జీవితాలకు ప్రాణాధారం” నినాదాలు ఇచ్చారు.