Telugu News Power

చిరంజీవి యువత రక్తదానం.

రక్తదాతలను సత్కరిస్తున్న జనన జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు.

పాలకొల్లు: జూన్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రక్తదానం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి, కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ అధినేత ఈదుపల్లి శ్రీధర్, చిరంజీవి అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, రక్తదానం చేయటం అంటే, ఒకరికి పునర్జన్మ ఇవ్వడంతో సమానం అన్నారు. గతంలో రక్తదాన శిబిరం నిర్వహించటానికి పరిమితమైన అవకాశాలు మాత్రమే ఉండేవన్నారు‌. రక్తదానంపై అవగాహన పెరగటం వల్ల యువకులు ప్రమాదంలో ఉన్నవారికి ఎక్కడికైనా వెళ్లి రక్తదానం చేసి రావటాన్ని అభినందించారు. ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా మరింత మంది ముందుకు రావటానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా గతంలో ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు ఇచ్చి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.