పాలకొల్లు: ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) “ప్రపంచ వయో వృద్ధుల కోరికల దినోత్సవం” సందర్భంగా, రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం, వారి ధన,మాన,ప్రాణ,ఆస్తి, రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని, సంఘ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకటరత్నం డిమాండ్ చేశారు. వృద్ధుల కోర్కెల దినాన్ని పురస్కరించుకొని, సోమవారం, స్థానిక పురవీధులలో ఊరేగింపు జరిపారు. వానప్రస్థంలో నిరాధనకు గురికాకుండా ప్రశాంత జీవనం గడుపుటకు తగిన నిధులు కేటాయించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్న
స్థానిక సీనియర్ సిటిజెన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రత్నం, ప్రధాన కార్యదర్శి జి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో,
తహసీల్దార్ యడ్ల దుర్గాకిశోర్ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రత్నం మాట్లాడుతూ…
ఆంధ్ర ప్రదేశ్ లో 60 సంవత్సరములు పై బడిన వారు సుమారు 60 లక్షలు మంది వున్నారని,వారిలో 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో,తగిన ఆహారము, ఆరోగ్యము, ఆవాసము, ఆదరణ, రక్షణ లేక,
దుర్భరజీవితంగడుపుతున్నారన్నారు. తమ జీవితం లో విలువైన 40 ఏళ్ళు వివిధ వృత్తులలో పనిచేసి, దేశానికీ, సమాజానికి హితోదిక సేవలు అందించి, అంతిమదశలో పిల్లలు, సమాజం లో నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురవుతున్న వృద్దులకు కేంద్రప్రభుత్వం
2007 లో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టము, రాష్ట్ర ప్రభుత్వము 2011 లో, తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ,
సంక్షేమ నియమావళిజారిచేసినా,
అమలకు తగిననిధులు,సిబ్బంది లేనందున చట్టం, అమలు చాలా నిరాశజనకంగా ఉందన్నారు,
రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు 40వేల పింఛను ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం 1999 వయో వృద్ధుల జాతీయ విధానము ద్వారా ఆరోగ్యం, సంరక్షణ కొరకు
కొంత కృషి చేసినా,ఐక్యరాజ్య సమితి ప్రపంచవయోవృద్దులకోరికల దినోత్సవం ఆగస్టు16అని ఆదేశించినా,
సమాజంలో వృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన, అమలు లోపం వల్ల
ప్రతీఏటా ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పిస్తూనేఉన్నామని ఆవేదన వ్యక్తం చేసారు.
వృద్ధుల సంక్షేమం కొరకు వినతిపత్రం లో తెలియ జేసిన కోర్కెలు అమలుకు ప్రభుత్వానికి తాశీల్దార్ ద్వారావిన్నవించు
కుంటున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో
గౌరవ అధ్యక్షులు వంగా నరసింహారావు,
కోశాధికారి డా. పేరిచర్ల సత్య ప్రతాప్ రాజు, అడ్డాల వాసుదేవ రావు,
డి.రామకృష్ణం రాజు,ముక్కు బాబు, కలిదిండి వెంకటపతి వర్మ,పెనుగొండ సూర్యనారాయణ, రాయి సూరిబాబు,
పుత్సల నాగలింగేశ్వరరావు,
సలాది సత్యనారాయణ మూర్తి, యర్రమిల్లి నరసింహ రావు, కానూరి ప్రభాకర్, కంచి సత్యనారాయణ,కంచర్లగౌరి,ముచ్చర్ల ప్రసాద్, గెద్దాడ పనీంద్రుడు, వి.దుర్గాపాలేశ్వరి,మండెలపెద్ద,
ఎన్సీసీవెంకట్రావు,మానెంగణేశ్వరరావు,గుణ్ణం రాంబాబు, వంగా శేషారావు, నిమ్మల నాగమల్లేశ్వరరావు,
గోడి మోహన రావు, శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.
వయో వృద్ధుల శ్రేయస్సే మానవ సమాజ సంక్షేమం.
వృద్ధుల కోర్కెల దినోత్సవం సందర్భంగా ర్యాలీ