పాలకొల్లు: ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్ఫూర్తివంతమైన న్యాయకత్వానికి వలవల శ్రీరామ్మూర్తి ఆదర్శంగా నిలుస్తారని, యుటిఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక ప్రముఖులు, కదలిక అధ్యక్షులు పోలిశెట్టి గోపాలకృష్ణ గోపాల పేర్కొన్నారు. వలవల శ్రీరామమూర్తి ద్వితీయ వర్ధంతి సభ సోమవారం స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల లో జరిగింది. ఈ సభకు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, గోఖలే మాట్లాడుతూ, ఒక ఉపాధ్యాయుడి సమస్య పరిష్కారం కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ గొప్ప నాయకులు వలవల అని వెల్లడించారు. ఉద్యమ విస్తృతికి కేవలం సైకిల్ పై సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసిన గొప్ప నాయకుడని వలవలని కొనియాడారు. క్రాంతి తన అధ్యక్ష ఉపన్యాసంలో, యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రముఖుల్లో శ్రీరామ్మూర్తి ఒకరిని పేర్కొన్నారు. ఇంకా 9 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ, ఉద్యోగాన్ని వదులుకొని, ప్రజాసేవ కోసం సిపిఎం పార్టీలో చేరిన త్యాగజీవి వలవలని నివాళులర్పించారు. పోడూరు, మొగల్తూరు సమితిలో వారి ప్రభావం అనితర సాధ్యమైందని అన్నారు. వివిధ సంఘాలతో, రసద్విని వంటి సాహిత్య పరిషత్తులతో వారికి అనుబంధం ఉందన్నారు. ఈ సభలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు,పోలిశెట్టి వెంకట నరసింహారావు (పీవీ), రామానుజ రావు, జయప్రభ, వర్ధినిడి నాగేశ్వరరావు, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, దేవ సుధాకర్, రసధుని అధ్యక్షులు, ఎర్రంశెట్టి వెంకటరత్నం, గుత్తుల సత్యనారాయణ, వలవల కుటుంబ సభ్యులు బాలాజీ, యజ్ఞప్రసాద్, విజయలక్ష్మి, అజయ్ కుమార్, ప్రకాష్ తదితర పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్ఫూర్తివంతమైన నాయకత్వానికి ఆదర్శం వలవల. -వర్ధంతి సభలో వక్తల ఉవాచా
వలవల వర్ధంతి సభలో మాట్లాడుతున్న పోలిశెట్టి క్రాంతి