Telugu News Power

విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి.

అల్లూరికి నివాళులర్పిస్తున్న యూటీఎఫ్ నాయకులు

భీమవరం: మే,7(తెలుగు న్యూస్ పవర్. కాం)
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం, స్థానిక అడ్డవంతెన వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తిఘనంగా నివాళులర్పించారు.
ఈ ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పిడిఎఫ్ ఎమ్మెల్సీ,
అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అందించే ఘన నివాళి అన్నారు. అల్లూరి ప్రజలను సమీకరించి, పోరుబాట పట్టించి స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని కొనసాగించారన్నారు.
సామాన్య ప్రజల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అసమాన త్యాగశీలి అల్లూరి సీతారామరాజుని జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, పిఎస్ విజయరామరాజు,
ప్రధాన కార్యదర్శి, పి. క్రాంతికుమార్,
యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవీవీ రామానుజరావు,
జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ పట్టాభిరామయ్య జిల్లా కార్యదర్శులు జి రామకృష్ణంరాజు కే శ్రీ రామకృష్ణ ప్రసాద్ సిహెచ్ కుమార బాబ్జి
జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి ప్రసాదరావు
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు పి సీతారామరాజు పాలకోడేరు మండల శాఖ ప్రధాన కార్యదర్శి కౌరు త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు