Skip to main content

Telugu News Power

శ్రీరాముని అవతారంలో అనుగ్రహ దర్శనం.

శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి శ్రీరాముని అవతారంలో అనుగ్రహ దర్శనం

పాలకొల్లు: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, నాలుగో రోజు స్వామివారు శ్రీరాముని అవతారంలో, హనుమంత వాహనంపై భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. పురవీధులలో ఊరేగిన స్వామి వారిని పలురువు భక్తులు, భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు, కరి పవన్ స్వామి, సాక్షాత్తు శ్రీరాముల వారు దిగి వచ్చారా అన్నట్టుగా, సర్వాలంకృత,శోభయమానంగా అలంకారాన్ని తీర్చిదిద్దారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను, కార్యనిర్వహణాధికారి, బిరుదుకోట శంకర్, ధర్మకర్త, ఉత్సవ కైంకర్య పరులు,ఎస్. రామకృష్ణ ప్రసాద్, దాసరి నగేష్, నున్న కోటి, మాజేటి రాంబాబు, మామిడి బాబు, రేపాక సుబ్బారావు ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.