విశాఖపట్టణం: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ( కేజీహెచ్) వద్ద కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళవారం పరామర్శించారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించడంతోపాటు, ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.రాష్ట్ర హోం మంత్రి అనిత, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్, మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి తదితరులు బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి, ఓదార్చారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రుల పరామర్శ.
బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న మంత్రులు లోకేష్, శ్రీనివాస వర్మ, అనిత