
పాలకొల్లు: అక్టోబర్, 20( తెలుగు న్యూస్ పవర్.కామ్)
స్థానిక శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గత పది రోజులుగా జరిగిన దసరా ఉత్సవాలు మంగళవారం ఘనంగా మూశాయి. వైష్ణవ భక్తులు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం(చినగోపురం) శ్రీ వాసవి కళ్యాణ మండపాల వద్దు భక్తులు రాత్రి వరకు రెండోపదండాలుగా తరలి వచ్చి దర్శించుకున్నారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న శ్రీ వాసవి కళ్యాణ మండపంలోని లడ్డు వేలం నిర్వహించారు. వైసిపి నాయకులు, గాదంశెట్టి సతీష్ ( బిస్కెట్ల సతీష్) వేలంలో
రూ. 21 వేల వరకు వెళ్లారు. పలివెల భాస్కర్ రూ. 21,500 లకు వేలంలో లడ్డు దక్కించుకున్నారు. అమ్మవారి చీరలకు రూ. 50 లతో లక్కీ డిప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, రేపాక ప్రవీణ్ భాను, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకరరావు,సురేష్ తదితర పలువురు భక్తులు పాల్గొన్నారు.
