Skip to main content

Telugu News Power

ఉత్కంఠగా సాగుతున్న కాస్మో క్లబ్ జాతీయ సీనియర్ టెన్నిస్ పోటీలు.

ఉత్కంఠ భరితంగా సాగుతున్న సీనియర్ టెన్నిస్ పోరు

పాలకొల్లు: అక్టోబర్, 19
(తెలుగు న్యూస్ పవర్.కామ్)చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక, స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆధ్వర్యంలో, ఎ ఐ ఎస్ టీ ఏ, ఏ పి ఎస్ టీ పి ఏ సహకారంతో, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, అఖిలభారత సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. నర్సాపురం, పాలకొల్లు లో క్రీడాభిమానులను ఈ పోటీలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీల్లో, సింగిల్స్ 45-55 విభాగంలో 16 మంది క్రీడాకారులు సోమవారం జరిగిన పోరులో సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. అలాగే 65 పైబడిన క్రీడాకారులకు జరిగిన పోటీలో నలుగురు, 70 పైబడిన క్రీడాకారులకు , సింగిల్స్ లో జరిగిన పోటీల్లో నలుగురు క్వార్టర్ ఫైనల్స్ లో విజయం సాధించి, సెమీస్ లోకి ప్రవేశించారు. టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి, గొట్టుముక్కల శ్రీ వెంకట రామ సూర్య నారాయణ రాజు (బూన్ రాజు) సోమవారం పత్రికలకు తెలిపారు.