Skip to main content

Telugu News Power

శ్రీ విజయ దుర్గ అవతారంలో భక్తులకు అనుగ్రహం దర్శనం ఇచ్చిన దుర్గమ్మ.

శ్రీ విజయ దుర్గ అవతారంలో అమ్మవారు

పాలకొల్లు: అక్టోబర్, 20( తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక ఎడ్ల బజారు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రులు మంగళవారం సంపూర్ణం అయ్యాయి. ఈ సందర్భంగా, భక్తులు ఉదయం నుంచి, రాత్రి వరకు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్ దంపతులు వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, జనసేన జిల్లా నాయకులు, తులా రామలింగేశ్వర రావు వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచన పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటం చేయూత ప్రసాదాలు అందజేశారు.