పాలకొల్లు:అక్టోబర్ 2, (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్, టు, చరిత్ర విభాగం మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, గాంధీజీ అహింస, సత్యం, శాంతి, స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని వివరించారు. గాంధీజీ ఆశయాలను నేటి యువతరం ఆచరించాలని, సమాజంలో శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కే శామ్యూల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా ఎం రామకృష్ణ, డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, చరిత్ర అధ్యాపకులు
కే. పార్థసారథి, తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ అద్దేపల్లి కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
మహాత్మా గాంధీ కి నివాళులు అర్పిస్తున్న దృశ్యం