పాలకొల్లు: మే, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిన్న గోపురంలో వేంచేసియున్న చతుర్భుజ లక్ష్మీ తాయారు సమేత, శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు, గురువారం పెద గోపురం ఆలయ ధర్మకర్తల మండలి పూజలు నిర్వహించారు. శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు, పినిశెట్టి శ్రీనివాస్ (చిన్ని) బసవ సత్యనారాయణ తదితరులు, ఏఎంసి డైరెక్టర్ బెట్ట లక్ష్మీనారాయణ తదితరులుచేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కరి పవన్ స్వామి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ప్రవీణ్ భాను, కార్యనిర్వహణాధికారి బిరుదుకోట శంకర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పెదగోపురం ధర్మకర్తల మండలి.
శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పెద గోపురం ధర్మకర్తల మండలి