
భీమవరం:మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సభలో ఎమ్మెల్యే అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నివాళులర్పించారు. జిల్లా కేంద్రం భీమవరం జెపి రోడ్డులోని, అల్లూరి స్మృతి వనం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద ఉద్దరాజు ఆనందరాజు పౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి 102వ వర్ధంతి కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, సుమారు రూ 25 లక్షలతో వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ మౌంటెన్స్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ధైర్య సాహసాలు, దేశభక్తితో వారి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారన్నారు. అల్లూరి జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. అల్లూరి త్యాగం భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని, అల్లూరి ఆశయాలు, చూపిన మార్గం నేటి తరాలందరికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు వేషధారణ లతో విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఉద్దరాజు విశ్వనాథరాజు, కంతేటి వెంకట్రాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, విగ్రహ కమిటి సభ్యులు చెరుకువాడ రంగసాయి, చేకూరి ఝాన్సీ లక్ష్మి, నందమూరి రాజేష్, కడలి వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాసు, మైలబత్తుల ఐజాక్ బాబు, టివివి ప్రసాద్, సత్యనారాయణ రాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. -వర్ధంతి సభలో వక్తల పిలుపు.
విప్లవ వీరుడు అల్లూరి వర్ధంతి సభలు ఎమ్మెల్యే అంజిబాబు