Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామంలో సరస్వతీ పూజ. బాలలకు విద్యా సామాగ్రి పంపిణీ.

పాలకొల్లు: అక్టోబర్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం సరస్వతీ పూజ జరిగింది. పెద గోపురంలో, పడమర వైపు వేంచేసి ఉన్న సరస్వతి దేవి ఉపాలయంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాలలు, తల్లిదండ్రులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజకు హాజరైన బాలలకు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సూచనల మేరకు, దేవస్థానం వారు విద్యాసామాగ్రి ( స్టేషనరీ ) ఉచితంగా పంపిణీ చేశారు. సరస్వతీ దేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున, పూజలు నిర్వహించటం వల్ల విద్యార్థులను విద్యాబుద్ధులతో సరస్వతి దేవి ఆశీర్వదిస్తుందని, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ పేర్కొన్నారు. పూజా కార్యక్రమం మద్దూరి సూరి బాబు తదితరులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో, ఆలయ కార్య నిర్వహణాధికారి, రాపాక శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు, పసుపులేటి వాసు, ధర్మకర్తలు ఉప్పలపు పెద్దిరాజు, బాసిన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా, శుక్రవారం అమ్మవారు సరస్వతి అవతారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం చేశారు. విశిష్టమైన మూలా నక్షత్రం కారణంగా, విశేషంగా తరలివచ్చి, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. గర్భగుడిలో మహాదేవుని లింగరూపానికి చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. గర్భగుడిలో కైలాసగిరి మంచు కొండల అలంకరణ ఆవిష్కరించారు. ఆలయంలో సువాసన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అభిషేకాలు విశేష పూజలు చేయించుకున్నారు. అభిషేక పండిట్ బ్రహ్మశ్రీ భమిడిపాటి వెంకన్న తదితర పురోహితులు ఈ పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తమ సేవలు అందించారు.
సరస్వతి దేవి పూజలో పాల్గొన్న బాలలు

పాలకొల్లు: అక్టోబర్, 16
(తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం సరస్వతీ పూజ జరిగింది. పెద గోపురంలో, పడమర వైపు వేంచేసి ఉన్న సరస్వతి దేవి ఉపాలయంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాలలు, తల్లిదండ్రులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజకు హాజరైన బాలలకు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సూచనల మేరకు, దేవస్థానం వారు విద్యాసామాగ్రి ( స్టేషనరీ ) ఉచితంగా పంపిణీ చేశారు. సరస్వతీ దేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున, పూజలు నిర్వహించటం వల్ల విద్యార్థులను విద్యాబుద్ధులతో సరస్వతి దేవి ఆశీర్వదిస్తుందని, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ పేర్కొన్నారు. పూజా కార్యక్రమం మద్దూరి సూరి బాబు తదితరులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో, ఆలయ కార్య నిర్వహణాధికారి, రాపాక శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు, పసుపులేటి వాసు, ధర్మకర్తలు ఉప్పలపు పెద్దిరాజు, బాసిన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా, శుక్రవారం అమ్మవారు సరస్వతి అవతారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం చేశారు. విశిష్టమైన మూలా నక్షత్రం కారణంగా, విశేషంగా తరలివచ్చి, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. గర్భగుడిలో మహాదేవుని లింగరూపానికి చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. గర్భగుడిలో కైలాసగిరి మంచు కొండల అలంకరణ ఆవిష్కరించారు. ఆలయంలో సువాసన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అభిషేకాలు విశేష పూజలు చేయించుకున్నారు. అభిషేక పండిట్ బ్రహ్మశ్రీ భమిడిపాటి వెంకన్న తదితర పురోహితులు ఈ పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తమ సేవలు అందించారు.