భీమవరం:అక్టోబర్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ నిధికి భీమవరం కి చెందిన ఆకుల వీరస్వామి, పద్మజారాణి పుణ్య దంపతులు సుమారు రూ.60 వేలు విలువైన 4 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజా,ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ధర్మకర్తలు పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం, అమ్మ వారి చిత్రపటం అందజేశారు.
శ్రీ మావుళ్లమ్మకు ఆకుల వీరస్వామి, పద్మజారాణి బంగారం గ్రా. 4 కానుక.
శ్రీ మావుళ్ళ కు కనకపు కానుక సమర్పించిన భక్తులు.