పాలకొల్లు:అక్టోబర్,5(తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద, సోమవారం ప్రదోషకాల సమయంలో మాడవీధుల్లో సప్తప్రదక్షిణాలలో సుమారు 200 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్, మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఆలయసూపరింటెండెంట్ వాసు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఆలయ అర్చకులు రఘునాథ్, సిబ్బంది పాల్గొన్నారు.