భీమవరం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్ఠమాస మహోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా, సోమవారం శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి వైభవంగా జరిగింది.దేవస్థానం సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కి పుట్టింటి,అత్తింటివారు గా వ్యవహరించే అల్లూరి వారు, మెంటే వారి వంశస్థులచే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, శ్రీ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతెన రమణ, యండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, అరసవిల్లి సుబ్రహ్మణ్యం, గుసిడి నాగశిరీష, పాపోలు ఏడుకొండలు ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మెంటే వారు కుటుంబీకులు, అల్లూరి వారి కుటుంబీకులు కు, తగు సత్కారం చేసి వేద ఆశీస్సులు తో పాటు, ప్రసాదం అందచేసారు.
శ్రీ మావుళ్ళమ్మకు ఊయల సేవ.
శ్రీ మావుళ్ళమ్మకు ఊయల సేవ